ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత..! 23 h ago
TG : పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కింద రూ.1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నాయి. దీంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితులు లేకుండాపోయాయని వెల్లడించాయి. కాగా.. ఏడాదిలో రూ. 920కోట్ల బిల్లులు చెల్లించామని, మరో రూ.450-500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.